MNCL: కాంగ్రెస్ ప్రభుత్వం విద్యా రంగ అభివృద్ధిపై దృష్టి సారించి ఉన్నత విద్యను అందిస్తుందని తెలంగాణ రాష్ట్ర కార్మిక, గనుల శాఖ మంత్రి వివేక్ అన్నారు. జైపూర్ మండల కేంద్రంలో కస్తూర్బా గాంధీ బాలిక జూనియర్ కళాశాలలో రూ.2 కోట్ల 55లక్షల సమగ్ర శిక్ష నిధులతో చేపట్టిన నూతన భవన నిర్మాణాన్ని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్‌తో కలిసి బుధవారం ప్రారంభించారు.