WGL: మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. 2024లో కాంగ్రెస్ ప్రభుత్వ పరంగా విజయాల కన్నా వైఫల్యాలే ఎక్కువగా ఉన్నాయన్నారు. ప్రజలకు కోటి ఆశలు చూపిన పార్టీ.. ఏట్లో రాయి కాదు, కనీసం కూట్లో రాయి కూడా తీయలేదన్నారు. అభయహస్తం ప్రజలను భయపెట్టే, బాధపెట్టే హస్తంగా మారిందని విమర్శించారు.