MBNR: ప్రజా సంక్షేమానికి ఏఆర్ పోలీస్ సిబ్బంది కట్టుబడి ఉన్నారని మహబూబ్ నగర్ జిల్లా ఎస్పీ జానకి ధారావత్ అన్నారు. శుక్రవారం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని పోలీస్ మైదానంలో నిర్వహించిన కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ఏఆర్ సిబ్బంది తమ తమ కుటుంబాలను వదిలి ప్రజా సంక్షేమానికి పాటు పడతారని వెల్లడించారు.