NRML: అనంతపెట్లోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టోర్రూమ్, వంటగది, డైనింగ్హాల్తో పాటు విద్యుత్, తాగునీరు, బాత్రూం వసతులను పరిశీలించి, విద్యార్థులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. నాణ్యమైన విద్య, మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.