SRD: కోహిర్ మండలంలోని సజ్జాపూర్ గ్రామ బేగరి రాములకు చెందిన ఇంటి నిర్మాణం కూల్చివేత విషయాన్ని తెలుసుకున్న జహీరాబాద్ మాజీ ఎంపీ బీబీ పాటిల్ శనివారం బాధిత కుటుంబాన్ని సందర్శించారు. జరిగిన విషయాలను అడిగి తెలుసుకున్నారు. తన వంతుగా బాధితుడికి రూ. 50వేలు సాయం అందజేశారు. మీ కుటుంబానికి అండగా ఉంటానని ధైర్యం ఇచ్చారు. కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు.