SRPT: సేంద్రియ ఎరువుల వినియోగంతోనే భూసారం పెరిగి, నాణ్యమైన పంటలు, స్థిరమైన దిగుబడులు సాధ్యమవుతాయని నార్మ్ డైరెక్టర్ డా. గోపాల్ లాల్ తెలిపారు. సోమవారం గరిడేపల్లి మండలం కేవీకే గడ్డిపల్లిలో షెడ్యూల్ కులాల రైతుల కోసం నిర్వహించిన ఐదు రోజుల సేంద్రియ వ్యవసాయ శిక్షణ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు.