VZM: జిల్లాలోని కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయాల్లో 63 బోధనేతర పోస్టుల భర్తీకి అర్హులైన మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నట్లు అదనపు పథక సమన్వయకర్త రామారావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తులు ఈ నెల 06 నుంచి 20 లోపు సమగ్ర శిక్ష కార్యాలయంలో ఆఫ్లైన్లో సమర్పించాలని, ఎంపిక మండల యూనిట్ ప్రాతిపదికన ఇంటర్వ్యూల ద్వారా జరుగుతుందన్నారు.