BHNG: ఇంటర్మీడియట్ పరీక్షల్లో వంద శాతం ఉత్తీర్ణత సాధించేందుకు కళాశాల ప్రిన్సిపల్స్ కృషి చేయాలని జిల్లా కలెక్టర్ హనుమంతరావు అన్నారు. సోమవారం మినీ మీటింగ్ హాల్లో జిల్లా ఇంటర్మీడియట్ ఉత్తీర్ణతపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లడుతూ.. ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యత కల్పిస్తునందున అదే దిశగా నాణ్యమైన విద్యా బోధన చేయాలన్నారు.