KMM: నేలకొండపల్లి మండలంలోని చెరువు మాదారం గ్రామంలో అంగన్వాడి సెంటర్లోని చిన్నపిల్లలకు డాక్టర్ రాజశేఖర్ కంటి పరీక్షలను నిర్వహించారు. వారు మాట్లాడుతూ.. చిన్న పిల్లలకు మొబైల్ ఫోన్స్ ఇవ్వవద్దని వాటి వలన చూపు త్వరగా మందగిస్తుందని చిన్నారులకు ఆకుకూరలు ఎక్కువగా తినిపించాలని అన్నారు. కార్యక్రమంలో సీడీపీఓ రత్నకుమారి సూపర్వైజర్ పార్వతి అంగన్వాడి టీచర్స్ పాల్గొన్నారు.