SDPT: సైదాపూర్ మండలంలో ఇటీవల మరణించిన పలువురి కుటుంబాలను మంత్రి పొన్నం ప్రభాకర్ పరామర్శించారు. దుద్ధినపల్లిలో ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించిన పొన్నం మహేందర్ కుటుంబాన్ని పరామర్శించారు. వెన్నెంపల్లిలో పేరాల శ్రీకాంత్ రావు, సోమారంలో పిట్టల లక్ష్మి చిత్రపటాలకు నివాళులు అర్పించారు. వారి కుటుంబాలను పరామర్శించి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.