NDL: రుద్రవరం మండల పరిధిలోని హరివరం గ్రామ శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో పోలీసులకు గాయాలైన విషయం తెలిసిందే. నంద్యాలలోని ఉదయానంద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కానిస్టేబుల్ చిన్న బాబును ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా స్వయంగా ఆస్పత్రికి వెళ్లి పరామర్శించారు. డాక్టర్లకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కోరారు. కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చారు.