కృష్ణా: పామర్రు మండలం కనుమూరు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. ఈక్రమంలో అటుగా వెళ్తున్న మంత్రి కొలుసు పార్థసారథి తన వాహనాన్ని ఆపి, క్షతగాత్రులను తన కాన్వాయ్‌లోని వాహనంలో హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అనంతరం మంత్రి కొలుసు వేరొక వాహనంలో కేబినెట్ మీటింగ్‌కు వెళ్లారు.