NDL: కోవెలకుంట్లలో ‘స్వచ్ఛ ఆంధ్ర-స్వచ్ఛ కోవెలకుంట్ల’ పేరిట శనివారం మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో పాండురంగ స్వామి ఆలయం నుంచి ర్యాలీ నిర్వహిస్తున్నట్లు ఆయన క్యాంపు కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. కావున మండల స్థాయి అధికారులు, సచివాలయం ఉద్యోగులు, ప్రజా ప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థల కార్యకర్తలు, ప్రజలు హాజరుకావాలని పిలుపునిచ్చింది.