KDP: సింహాద్రిపురం మండలంలోని బిదినంచర్ల, గురిజాల, హిమకుంట్ల, కసనూరు, సుంకేసులు, సింహాద్రిపురం తదితర గ్రామాల్లో శుక్రవారం పెరాలసిస్‌తో బాధపడుతూ పింఛన్లు పొందుతున్న లబ్ధిదారులను ప్రత్యేక వైద్య బృందం నరసింహులు, డాక్టర్ హుస్సేన్ పీరా, డాక్టర్ షీలా భానులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు పింఛన్ లబ్ధిదారులు అర్హత కలిగి ఉన్నారా లేదా అని పరిశీలించారు.