MDK: చేగుంట పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి పురస్కరించుకొని 2k రన్ నిర్వహించారు. భారత ప్రభుత్వం 2014లో ఏక్తా దివస్ను ప్రారంభించిందని ఎస్సై చైతన్యకుమార్ రెడ్డి తెలిపారు. ఇది ప్రతి సంవత్సరం అక్టోబర్ 31న జరుపుకుంటామన్నారు. సంఘ సేవకులు అయిత పరంజ్యోతి, సొసైటీ చెర్మన్ అయిత రఘు రాములు, ఏఎస్ఐ శ్రీనివాస్, చల్లా లక్ష్మణ్ పాల్గొన్నారు.