»Confusion In Telangana Assembly Brs Members Chanted For Cm Revanth Reddy To Apologize
Telangana Assembly: తెలంగాణ శాసనమండలిలో గందరగోళం.. సీఎం క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ సభ్యుల నినాదాలు
తెలంగాణ అసెంబ్లీ రెండో రోజు మొదలైంది. శాసనమండలిలో గవర్నర్ ప్రసంగం తరువాత సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. అనంతరం సభ్యులపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ సీఎం రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు ఆందోళన చేశారు.
Confusion in Telangana Assembly.. BRS members chanted for CM Revanth Reddy to apologize
Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు మొదలయ్యాయి. శాసనమండలిలో గవర్నర్ ప్రసంగం తరువాత సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. అనంతరం బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు నిరసన చేపట్టారు. దీంతో శాసనమండలిలో గందరగోళం నెలకొంది. బీఆర్ఎస్ సభ్యులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు డిమాండ్ చేశారు. వెంటనే ఆయన క్షమాపణ చెప్పాలని పోడియంలోకి దూసుకెళ్లి ఆందోళన చేశారు. సభ మర్యాదలను కాపాడాల్సిన ముఖ్యమంత్రి సభ్యుల గురించి అగౌరవంగా మాట్లాడటం ఏంటని ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో సభను శాసనమండలి చైర్మన్ 10 నిమిషాల పాటు వాయిదా వేశారు. ముఖ్యమంత్రిపై వచ్చిన ఫిర్యాదును అసెంబ్లీ సెక్రటరీకి పంపామని మండలి ఛైర్మన్ తెలిపారు. మరోవైపు, శాసనసభ ప్రాంగణంలో మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహం ఏర్పాటుపై మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత వాయిదా తీర్మానం అందించారు. దీనిపై చర్చ కొనసాగించాలని కోరారు.
చదవండి:Free Current: ఉచిత కరెంట్‌కి 80 లక్షలకు పైగా దరఖాస్తులు!