తెలంగాణ సీఎం కేసీఆర్ (Kondagattu) కొండగట్టు పర్యటన వాయిదా పడింది. మంగళవారానికి బదులుగా సీఎం బుధవారం కొండగట్టులో పర్యటించన్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా బుధవారానికి వాయిదా వేశారు. సీ ఎం పర్యటన నేపధ్యంలో సంబంధించి అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు.
తెలంగాణ సీఎం కేసీఆర్ (Kondagattu) కొండగట్టు పర్యటన వాయిదా పడింది. మంగళవారానికి బదులుగా సీఎం బుధవారం కొండగట్టులో పర్యటించన్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా బుధవారానికి వాయిదా వేశారు. సీ ఎం పర్యటన నేపధ్యంలో సంబంధించి అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు. బుధవారం ఉదయం (Cmkcr) కేసీఆర్ కొండగట్టు ఆలయానికి వెళ్లి స్వామి వారిని దర్మనం చేసుకుంటారు. అనంతరం సీ ఎం ఆలయాన్ని క్షేత్ర స్దాయిలో పరిశీలించన్నారు. (Kōnēru) కోనేరు పుష్కరిణి, కొండలరాయుని గుట్ట, సీతమ్మవారి కన్నీటిధార, భేతాళస్వామి ఆలయంతో పాటు పలు ప్రాంతాలను సీ ఎం పరీశీలించనున్నారు.. అక్కడే మీడియాతో కూడా మాట్లాడనున్నారు. ఇక సీఎం కేసీఆర్ పర్యటన ఏర్పాట్లను చొప్పదండి ఎమ్మెల్యే (Sunke Ravi Shankar) సుంకే రవిశంకర్, జగిత్యాల (Collector Yasmin) కలెక్టర్ యాస్మిన్ భాషా పరిశీలించారు. అనంతరం జేఎన్టీయూ క్యాంపస్‌లోని కాన్ఫరెన్స్ హాల్లో అధికారులతో సీఎం సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు.
అనంతరం మీడియాతో సీఎం కేసీఆర్ మాట్లాడనున్నారు.కొండగట్టు ఆలయ అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం రూ.100 కోట్లు కేటాయించింది. ఎల్లుండి సీఎంతో పాటు ప్రముఖ (Architect ) ఆర్కిటెక్ట్ ఆనంద్ సాయి కూడా కొండగట్టుకి వెళ్లనున్నారు. కొండగట్టు ఆలయ అభివృద్దిలో భాగంగా అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. దాదాపు 2 గంటల పాటు సీఎం కేసీఆర్ కొండగట్టులో ఉండనున్నారు.ఆలయాల అభివృద్ధిపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. ధూప, దీప నైవేద్యాలకు ఏ మాత్రం లోటు లేకుండా చూసుకుంటున్న (BRS) బీఆర్ఎస్ సర్కార్.. ఇప్పుడు ఆలయాలకు వైభవాన్ని కల్పించేందుకు చర్యలు తీసుకుంటోంది. దీనిలో భాగంగా (Yadadri ) తరహాలో కొండగట్టు అంజన్న ఆలయాన్ని అభివృద్ధి చేయాలని నిర్ణయించింది.ఇందుకోసం రూ.100 కోట్ల నిధులను మంజూరు చేసింది. కొండగట్టుకి నిధులు కేటాయించిన తర్వాతే ఆలయంలో అడుగు పెడతానన్న సీఎం కేసీఆర్.. ఇచ్చిన మాట నిలబెట్టుకోనున్నారు. ప్రముఖ ఆర్కిటెక్చర్ (Anand Sai ) ఆనంద్ సాయి ఆధ్వర్యంలో కొండగట్టు కొత్త రూపు దిద్దుకోనుంది. జగిత్యాల జిల్లా మల్యాల మండలం ముత్యంపేటలో ఉన్న కొండగట్టు (Anjaneya Swami ) ఆంజనేయ స్వామి ఆలయం చాలా ప్రాచీనమైన గుడి. ఇక్కడ వెలసిన ఆంజనేయ స్వామిని మహిమాన్వితుడిగా భక్తులు కొలుస్తుంటారు.
నిత్యం వేలాది మంది భక్తులు దర్శించుకుంటారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తో పాటుగా మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, కర్నాటక రాష్ట్రాల నుంచి భక్తులు ఇక్కడికి వస్తారు. (Telangana) తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రముఖ దేవాలయాలను అభివృద్ధి చేసే పనిలో భాగంగా.. సీఎం కేసీఆర్ ఇప్పటికే యాదాద్రిని పునఃనిర్మాణం చేసి.. తెలంగాణ తిరుపతిగా మార్చిన సంగతి తెలిసింది. ఇక.. మిగతా ఆలయాలైన వేములవాడ, కొండగట్టుపై దృష్టి సారించారు. ఈ నేపథ్యంలోనే కొండగట్టు అభివృద్ధి కోసం ఇటీవలే 100 కోట్లు కూడా ప్రకటించారు. కొండగట్టును తెలంగాణలో రెండో అతిపెద్ద పవిత్ర క్షేత్రంగా తీర్చిదిద్దేందుకు సీఎం కేసీఆర్ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది. గతంలో కేసీఆర్ చెప్పినట్టుగానే.. నిధులు విడుదల చేసిన తర్వాతే కొండగట్టుకు వస్తానన్న మాట నిజం చేస్తుండటం గమనార్హం..కేసీఆర్ పర్యటన కోసం జిల్లా ఎస్పీ భాస్కర్ ఏర్పాట్లను పరిశీలించారు. కొండగట్టుకు సమీపంలో ఉన్న జేఎన్టీయూ క్యాంపస్‌లో ఉన్న హెలిప్యాడ్‌ను ఎస్పీ పరిశీలించారు.