»Cm Kcr To Establish Namaste Andhra Pradesh Paper At Andhra Pradesh
‘namaste andhra pradesh’ఏపీలో బీఆర్ఎస్ పత్రిక.. దేశంలో ఇతర చోట్ల కూడా
‘namaste andhra pradesh’:దేశ రాజకీయాలపై బీఆర్ఎస్ చీఫ్, సీఎం కేసీఆర్ (cm kcr) దృష్టిసారించారు. మిగతా చోట్ల తన వాణిని వినిపించేందుకు మీడియా హౌస్ (media house) ప్రారంభించే యోచనలో ఉన్నారు. ఏపీలో నమస్తే ఆంధ్రప్రదేశ్ పేరుతో పత్రిక నెలకొల్పాలని అనుకుంటున్నారని తెలిసింది.
cm kcr to establish ‘namaste andhra pradesh’ paper at andhra pradesh
‘namaste andhra pradesh’:దేశ రాజకీయాలపై బీఆర్ఎస్ చీఫ్, సీఎం కేసీఆర్ (cm kcr) దృష్టిసారించారు. మిగతా చోట్ల తన వాణిని వినిపించేందుకు మీడియా హౌస్ (media house) ప్రారంభించే యోచనలో ఉన్నారు. తెలంగాణలో ఆ పార్టీకి ‘నమస్తే తెలంగాణ’ (namaste telangana) పేరుతో పేపర్, వెబ్ సైట్.. ‘టీ’ న్యూస్ ( t news) చానెల్ ఉన్న సంగతి తెలిసిందే. ఉద్యమ సమయంలో టీ న్యూస్ తెలంగాణ వాదాన్ని బలంగా వినిపించింది. తర్వాత నమస్తే తెలంగాణ పత్రిక నెలకొల్పారు. ఇప్పుడు జాతీయ పార్టీ ఏర్పాటు చేసిన కేసీఆర్.. మిగతా చోట్ల కూడా పత్రికలు నెలకొల్పాలని అనుకుంటున్నారని విశ్వసనీయంగా తెలిసింది.
తెలంగాణలో ‘నమస్తే తెలంగాణ’ పత్రిక ఉన్నట్టు.. ఏపీలో పత్రికకు ‘నమస్తే ఆంధ్రప్రదేశ్’ (‘namaste andhra pradesh’) అని పేరు పెడతారని సమాచారం. దీంతో అక్కడి ప్రజలకు దగ్గర కావాలన్నది కేసీఆర్ (kcr) లక్ష్యం. ఆ ప్రాంత ప్రజల కష్ట, నష్టాలు.. సాధక బాధలను తెలుసుకునే అవకాశం ఉంటుంది. పత్రికకు (paper) సంబంధించి ఆర్ఎన్ఐ ప్రక్రియ కూడా పూర్తయిందని తెలిసింది. ఏపీలో ఇప్పటికే వైసీపీ, టీడీపీ బలంగా ఉన్నాయి. బీజేపీ (bjp), జనసేన (janasena) కూడా సత్తా చాటేందుకు సిద్దం అవుతున్నాయి. కమ్యునిస్టులు ప్రభ కాస్త ఉంటుంది. ఈ క్రమంలో మరో పార్టీకి అక్కడి ప్రజలు విశ్వాసం లభిస్తోందా లేదా అన్నది చూడాలి.
దూరదృష్టితోనే కేసీఆర్ (kcr) పత్రిక ఏర్పాటు చేయాలని సంకల్పించాలని మరికొందరు అంటున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం దశాబ్దం పైగా కొట్లాడితే కదా వచ్చింది.. ఏపీలో కూడా అంతే.. లాంగ్ టైమ్‌లో అధికారం పక్కా అనే ధీమాతో కేసీఆర్ ఉన్నారు. అదీ వర్కవుట్ అవుతుందో లేదో చూడాలి మరీ.
ఇటు ఏపీలోనే (ap) కాదు పొరుగున గల కర్ణాటక (karnataka), తమిళనాడు (tamilnadu), ఒడిశాలో (odisha) తమ పార్టీ విస్తరణకు కేసీఆర్ వ్యుహారచన చేశారు. బీఆర్ఎస్ జాతీయ పార్టీగా మారిన నేపథ్యంలో.. మిగతా రాష్ట్రాల్లో కూడా పత్రికలు ప్రారంభించాలని అనుకుంటున్నారట. ఏపీలో పేపర్ పెడితే.. కర్ణాటకలో కన్నడ (kannada), తమిళనాడులో తమిళ్ (tamil), ఒడిశాలో (odisha) పేపర్స్ కూడా రావాల్సి ఉంటుంది. ఇక నార్త్‌కు సంబంధించి ఒక హిందీ పత్రికను ఏర్పాటు చేసి.. ఎడిషన్లలో ప్రింట్ చేస్తే సరిపోతుంది. కానీ కేసీఆర్ ముందుగా సౌత్‌పై ఫోకస్ చేశారని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది.