Chandrababu and Bhatti Vikramarka: బాత్రూంలో కాలు జారి పడటంతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు హిప్ జాయింట్ రీ ప్లేజ్ మెంట్ సర్జరీ జరిగింది. వారం రోజులు ఆస్పత్రిలో ఉండాలని వైద్యులు చెప్పడంతో అక్కడే ఉన్నారు. కేసీఆర్ క్రమంగా కోలుకుంటున్నారని వైద్యులు చెబుతున్నారు. ఆస్పత్రిలో ఉన్న కేసీఆర్ను నిన్న సీఎం రేవంత్ రెడ్డి పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. కోలుకుంటున్నారని డాక్టర్స్ కూడా చెప్పారు.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu) యశోద ఆస్పత్రికి ఈ రోజు వచ్చి పరామర్శించారు. వైద్యులను అడిగి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు. మరో 6 వారాల్లో కేసీఆర్ కోలుకుంటారని తెలిపారు. జీవితంలో కొన్ని ఇబ్బందులు వస్తాయని పేర్కొన్నారు. వాటిని కేసీఆర్ అధిగమిస్తారని వివరించారు. కేసీఆర్ త్వరగా కోలుకుని.. మరింత అంకిత భావంతో పనిచేయాలని చంద్రబాబు కోరుకున్నారు.
అంతకుముందు తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క (mallu bhatti vikramarka) కూడా ఆస్పత్రికి వచ్చారు. కేసీఆర్తో మాట్లాడారు. ఆరోగ్యం గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. కేసీఆర్కు వైద్యులు చేసిన సర్జరీ సక్సెస్ అయ్యిందని పేర్కొన్నారు. భట్టి విక్రమార్కతో ఓ మీడియా సంస్థ చైర్మన్ ఉన్నారు.