SRPT: గరిడేపల్లి మండలం వెలిదండ గ్రామంలో బుధవారం సాయంత్రం సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో పాలస్తీనాపై ఇజ్రాయిల్ దాడులకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ డివిజన్ కార్యదర్శి పోటు లక్ష్మయ్య మాట్లాడుతూ.. ఇజ్రాయిల్ దాడులు దుర్మార్గమైనవని విమర్శించారు. పసిపిల్లలు, మహిళలను విచక్షణారహితంగా చంపుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.