MBNR: బీసీ జనసేన సంక్షేమ సంఘం జడ్చర్ల నియోజకవర్గ అధ్యక్షుడిగా వినయ్ కుమార్ నియమితులయ్యారు. రాష్ట్ర అధ్యక్షుడు కత్తి చంద్ర శేఖరప్ప ఆయనకు నియామక పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వినయ్ మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన వారికి కృతజ్ఞతలు తెలిపారు. నియోజకవర్గంలో బీసీల సమస్యల పరిష్కారానికి, సంఘం బలోపేతానికి నిరంతరం కృషి చేస్తానని పేర్కొన్నారు.