GDWL: మొక్కజొన్న కొనుగోలులో రైతులకు అన్యాయం జరుగుతోంది. తేమ శాతం అధికంగా ఉందని, రైతులు తెచ్చిన పంటకు కాటా వేయకుండానే పక్కకు పెట్టడం, కొనుగోలు కేంద్రం దగ్గర కనీస సౌకర్యాలు కూడా ఎందుకు లేవని బీఆర్ఎస్వీ జిల్లా కోఆర్డినేటర్ పల్లయ్య ప్రశ్నించారు. బుధవారం రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ మానవపాడు మండలంలోని రైతు వేదికల వద్ద ధర్నా చేపట్టాడు.