NZB: బోధన్ MLA సుదర్శన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడిగా నియమితులై గురువారం జిల్లా కేంద్రానికి వస్తున్న సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పాత కలెక్టరేట్లో సుదర్శన్ రెడ్డికి అభినందన సభ నిర్వహించనున్నారు. ఈ మేరకు సభా స్థలిని నేడు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి, రాష్ట్ర ఉర్దూ అకాడమీ ఛైర్మన్ తాహెర్ బిన్ హందాన్ పరిశీలించారు.