MBNR: నవంబర్ 1వ తేదీన చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని విజయవంతం చేద్దామని వికలాంగ హక్కుల పోరాట సమితి నాయకులు జైపాల్ పిలుపునిచ్చారు. బుధవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గవాయిపై జరిగిన దాడికి నిరసనగా ఈ కార్యక్రమం ఉంటుందన్నారు. పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమం చేపడుతున్నామని తెలిపారు.