MHBD: కొత్తగూడ మండలం చెరువు ముందు తండాలో గుడుంబా స్థావరాలపై మంగళవారం ఎస్సై రాజ్‌కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా 300లీటర్ల బెల్లం పానకాన్ని ధ్వంసం చేశారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.