MLG: జిల్లా కేంద్రంలో గురువారం ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా డీఎంహెచ్వో గోపాలరావు ఆధ్వర్యంలో వైద్య సిబ్బంది ర్యాలీ నిర్వహించారు. పొగాకు వాడకం ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుందని ఆయన హెచ్చరించారు. సిగరెట్లలోని నికోటిన్ మత్తుకు బానిస చేస్తుందని, ఊపిరితిత్తులు దెబ్బతినడంతో పాటు రక్తపోటు, క్యాన్సర్, మధుమేహం వంటి వ్యాధులు వస్తాయని తెలిపారు.