BRS Ex Mla Malipedhi Sudheer Reddy To Join Congress Party
Sudheer Reddy: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ అభ్యర్థుల పార్టీ మార్పు ప్రక్రియ కొనసాగుతోంది. మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత మల్లిపెద్ది సుధీర్ రెడ్డి (Sudheer Reddy) ఆ పార్టీని వీడబోతున్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరతారని తెలిసింది. తమ పార్టీలోకి రావాలని స్వయంగా రేవంత్ రెడ్డి సుధీర్ రెడ్డి ఇంటికొచ్చి ఆహ్వానిస్తారని సమాచారం.
సుధీర్ రెడ్డి 2014లో మేడ్చల్ నుంచి బీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేసి గెలుపొందారు. 2018 ఎన్నికల్లో మాత్రం ఆయనకు టికెట్ ఇవ్వలేదు. మల్లారెడ్డికి (malla reddy) అవకాశం కల్పించింది. అప్పటికే మల్లారెడ్డి ఎంపీగా ఉండగా.. అసెంబ్లీ టికెట్ ఇచ్చారు. మల్లారెడ్డి కోసం సిట్టింగ్ సీటును అధినేత కేసీఆర్ కేటాయించారు. ఆ తర్వాత కూడా సుధీర్ రెడ్డి పార్టీలోనే ఉన్నారు. అయినప్పటికీ ప్రాధాన్యం లభించలేదు.
మల్లారెడ్డి మంత్రి అయ్యారు. రాజకీయంగా ఉన్నత స్థాయికి ఎదిగారు. మల్లారెడ్డికి- సుధీర్ రెడ్డికి పడటం లేదు. పళ్లా రాజేశ్వర్ రెడ్డి సుధీర్ రెడ్డిని కూల్ చేశారు. పార్టీలో ప్రాధాన్యం లేదని.. నామినేటెడ్ పదవీ కూడా ఇవ్వడం లేదని అంటున్నారు. అందుకే పార్టీ మీద కోపంతో ఉన్నారు. మేడ్చల్ టికెట్ ఇస్తేనే కాంగ్రెస్ పార్టీలోకి వస్తానని రేవంత్ రెడ్డికి సుధీర్ స్పష్టంచేశారని సమాచారం. ఇప్పటికే అక్కడి నుంచి హరివర్ధన్ రెడ్డి, జంగయ్య యాదవ్, నక్క ప్రభాకర్ గౌడ్ వంటి నేతలు ఉన్నారు. సో.. మరి రేవంత్ ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలీ. టికెట్ ఇస్తే.. మల్లారెడ్డిని ఓడిస్తానని సుధీర్ రెడ్డి అంటున్నారు.