కామారెడ్డి: రామారెడ్డి మండలం మొండి వీరన్న తండాలో వరి కొనుగోలు కేంద్రాన్నిజిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. వరి కొనుగోలు కేంద్రంలో రైతుల నుంచి కొనుగోలు చేసిన వరి ధాన్యం నమూనాలను స్వయంగా తనిఖీ చేసి మాయిశ్చర్ శాతం (తేమ స్థాయి) పరిశీలించారు. ఎలాంటి లోటుపాట్లు లేకుండా సిబ్బంది జాగ్రత్తగా ఉండాలని ఆదేశించారు.