»Bellampalli Mla Durgam Chinnaiah Threatening Letter From Maoists
Maoists: ఎమ్మెల్యేకు మావోయిస్టుల బెదిరింపు లేఖ..అమ్మాయిల విషయంలో కూడా
తెలంగాణలోని బెల్లంపల్లి(Bellampalli) ఎమ్మెల్యే(MLA) దుర్గం చిన్నయ్య(Durgam Chinnaiah)కు మావోయిస్టులు(Maoists) లేఖ రాశారు. చిన్నయ్య డైరీ పని కోసం వచ్చే మహిళలను లైంగికంగా వేధిస్తున్నాడని లేఖలోపేర్కొన్నారు. దీంతోపాటు బెదిరింపులు, భూ కబ్జాలు చేస్తున్నారని..ఈ క్రమంలో తీరు మార్చుకోవాలని సూచించారు.
గతంలో తెలంగాణలో పలు ప్రాంతాల్లో ఏదైనా గ్రామ సర్పంచ్ ఆయా ప్రాంతాలకు సరిగా పనులు చేయకున్నా లేదా నిధులు కాజేసినా కూడా మావోయిస్టులు(Maoists) వారిని లేఖల ద్వారా హెచ్చరించేవారు. అంతేకాదు అలా వారి హెచ్చరికలను కాదని నిధుల దుర్వినియోగం సహా అనేక పనులు చేపట్టిన వారిని హతమార్చిన ఘటనలు కూడా ఉన్నాయి. అయితే ప్రస్తుతం అనేక గ్రామాల్లో మావోయిస్టుల ప్రభావం పెద్దగా కనిపించడం లేదనే చెప్పవచ్చు.
కానీ తాజాగా బెల్లంపల్లి(Bellampalli) ఎమ్మెల్యే(MLA) దుర్గం చిన్నయ్య(Durgam Chinnaiah)ను మావోయిస్టులు హెచ్చరించారు. మావోయిస్టు పార్టీ అనుబంధ కార్మిక సంఘం సింగరేణి కార్మిక సమాఖ్య కార్యదర్శి ప్రభాత్ పేరిట వచ్చిన హెచ్చరిక లేఖ ప్రస్తుతం జిల్లాలో కలకలం రేపుతుంది. చిన్నయ్య తన వద్దకు పని కోసం వచ్చే మహిళలను లొంగదీసుకుంటున్నాడని, రౌడీయిజం చేస్తున్నాడని లేఖలో పేర్కొన్నారు. ఎమ్మెల్యేకు ప్రముఖ డైరీ నిర్వహకులు అమ్మాయిలను సరఫరా చేస్తున్నారని పేర్కొన్నారు.
అంతేకాదు భూకబ్జాలకు పాల్పడుతూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాడని, అవినీతికి పాల్పడుతున్నారని లేఖ(letter)లో ఆరోపించారు. మరోవైపు నష్టపోయిన రైతులకు వెంటనే డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేశారు. చిన్నయ్య తన తీరు మార్చుకోకుంటే ప్రజల చేతుల్లోనే శిక్ష అనుభవించాల్సి ఉంటుందని లేఖలో హెచ్చరించారు. చిన్నయ్య అనుచరులు గడ్డం బీమా గౌడ్, సానా శ్రవణ్, సన్నిబాబు, సుదర్శన్, మాధవ్, ప్రకాష్లకు మావోయిస్టుల నుంచి హెచ్చరికలు అందినట్లు తెలుస్తోంది.