NZB: ఉమ్మడి NZB జిల్లా డిప్యూటీ కమిషనర్ సోమిరెడ్డి, ఎక్సైజ్ అధికారి హన్మంతరావు ఆదేశాల మేరకు KMR ఎక్సైజ్ సిబ్బంది పల్వంచ మండలం ఆరేపల్లిలో సోదాలు నిర్వహించారు. ఓ ఇంట్లో అక్రమంగా దాచిన 55 సీసాల మిలిటరీ లిక్కర్ సుమారు 41.25 లీటర్లు స్వాధీనం చేసుకున్నట్లు గురువారం తెలిపారు. నిందితుడు హన్మండ్లుపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.