MNCL: తాండూర్ మండలం మాదారం అంగన్వాడీ-3 కేంద్రంలో ‘అమ్మ మాట-అంగన్వాడీ బాట’ కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. సర్పంచ్ లక్ష్మణ్ మాట్లాడుతూ.. ఐదేళ్ల లోపు పిల్లలందరినీ అంగన్వాడీ కేంద్రాల్లో చేర్పించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళా, శిశు సంక్షేమం కోసం అనేక పథకాలు అమలు చేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ దామోదర్ రెడ్డి, వార్డు సభ్యులు పాల్గొన్నారు.