HNK: హన్మకొండ జేఎన్ఎస్ స్టేడియంలో 41వ సౌత్ జోన్ హ్యాండ్బాల్ ఛాంపియన్షిప్ పోటీలు మంగళవారం రాత్రి ఘనంగా ప్రారంభమయ్యాయి. మూడు రోజుల పాటు ఈ పోటీలు జరగనున్నాయి. ఈ కార్యక్రమాన్ని డీసీసీ అధ్యక్షుడు, కుడా ఛైర్మన్ వెంకట్రామ్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. హన్మకొండ క్రీడలకు నిలయంగా మారుతోందని, క్రీడలు యువతలో పోటీ తత్వాన్ని పెంపొందిస్తాయన్నారు.