Bandi Sanjay : ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవితకు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. కవితకు నోటీసులు జారీ చేసిన దగ్గర నుంచి... బీజేపీ పై బీఆర్ఎస్ నేతలు విమర్శలు వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో...దీనిపై బండి సంజయ్ స్పందించారు.
ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవితకు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. కవితకు నోటీసులు జారీ చేసిన దగ్గర నుంచి… బీజేపీ పై బీఆర్ఎస్ నేతలు విమర్శలు వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో…దీనిపై బండి సంజయ్ స్పందించారు.
కవిత బతుకమ్మ పేరుతో తెలంగాణ సంస్కృతిని దెబ్బ తీసింది. చెప్పులు, హ్యాండ్ బ్యాగులు పెట్టించి కృతిమ పూలు, డీజే పాటలతో బతుకమ్మ ఆడించి విలువ తీసేసిందని అన్నారు. బీఆర్ఎస్ రాష్ట్ర కమిటీలో ఎంత మంది మహిళలు ఉన్నారు? అని ప్రశ్నించిన ఆయన కవితను అరెస్ట్ చేయకపోతే ముద్దు పెట్టుకుంటారా? అని ప్రశ్నించారు.
కేసీఆర్ కుటుంబంలో ఒక వికెట్ క్లీన్ బౌల్డ్ అని, కవిత చేసిన దొంగ సారా దందా.. కేసీఆర్ కు నచ్చిన స్కీం అని అన్నారు. ఇక కవిత తెలంగాణ మహిళలు తల దించుకునేలా చేసిందన్న ఆయన నరేంద్ర మోడీ ప్రధాని అయిన సంవత్సరమే కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యారని, మరి రాష్ట్ర మహిళల కోసం కేసీఆర్ ఏం చేశారో ఆలోచించాలని అన్నారు.
బీఆర్ఎస్ కి మహిళా కమిటీలే లేవు, అసలు పార్టీ మహిళా అధ్యక్షురాలు ఎవరు? అని ప్రశ్నించారు. మహిళలకు ప్రభుత్వంలో పార్టీలో పదవులు ఇచ్చి గౌరవించే పార్టీ బీజేపీ అని పేర్కొన్న ఆయన వంట గదికే పరిమితమైన యాదమ్మ ప్రధానికి వంట చేసే స్థాయికి ఎదిగిందని అన్నారు. ఇక జల జీవన్ మిషన్ కింద ప్రధాని మహిళల కోసం ఆరు కోట్ల నల్లా కనెక్షన్లు ఇచ్చారని బండి సంజయ్ అన్నారు.