దక్షిణ మధ్య రైల్వే తమ ప్రయాణికులకు బ్యాడ్ న్యూస్ చెప్పింది. తమ పరిధిలోని విజయవాడ డివిజన్లో భద్రతాపరమైన పనులు నిర్వహిస్తున్నందున పలు రైళ్లను రద్దు చేసింది. ఆ మార్గంలో ప్రయాణించే పలు రైళ్లను అధికారులు రద్దు చేయడంతో ప్రయాణికులు లబోదిబోమంటున్నారు. అదేవిధంగా మరికొన్ని రైళ్లను కూడా పాక్షికం రద్దు చేసినట్లు రైల్వే శాఖ ప్రకటించింది. కొన్నింటిని దారి మళ్లించినట్లు వెల్లడించింది.
ఆగస్టు నెల 14వ తేది నుంచి 20వ తేదీ వరకు కాకినాడ-విశాఖపట్నం ప్యాసింజర్ స్పెషల్, విశాఖపట్నం-కాకినాడ ప్యాసింజర్ స్పెషల్, రాజమండ్రి-విశాఖపట్నం స్పెషల్ ప్యాసింజర్, విశాఖపట్నం- రాజమండ్రి స్పెషల్ ప్యాసింజర్, విశాఖపట్నం-విజయవాడ ఉదయ్ ఎక్స్ ప్రెస్, విజయవాడ-విశాఖపట్నం ఉదయ్ ఎక్స్ప్రెస్ రైళ్లను రైల్వే శాఖ రద్దు చేసింది. 15వ తేది నుంచి 21వ తేది మధ్య విశాఖపట్నం-గుంటూరు సింహాద్రి ఎక్స్ప్రెస్, గుంటూరు-విశాఖపట్నం సింహాద్రి ఎక్స్ప్రెస్ను దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసినట్లు ప్రకటించింది.
ఆగస్టు 14, 15వ తేదీల్లో ఎర్నాకుళం నుంచి పాట్నాకు వెళ్లే ఎక్స్ప్రెస్ను, 16, 18వ తేదీల్లో ఎస్వీఎం బెంగళూరు నుంచి గౌహతి ఎక్స్ప్రెస్, 13వ తేది నుంచి 20వ తేదీ వరకూ కోయంబత్తూరు-సిల్చార్ ఎక్స్ప్రెస్ను దారి మళ్లించినట్లుగా రైల్వే శాఖ వెల్లడించింది. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే విజయవాడ, గుడివాడ, భీమవరం, నిడదవోలు మార్గంలో కాకుండా విజయవాడ, ఏలూరు, నిడదవోలు మార్గంలో రైళ్లను నడపనున్నట్లు రైల్వే శాఖ తెలిపింది.