Bad news for alcohol lovers.. Wines closed tomorrow
Holy Festival: మందుప్రియులకు(alcohol lovers) ఎక్సైజ్ శాఖ బ్యాడ్ న్యూస్ చెప్పింది. సోమవారం వైన్ షాప్ల(Wines Shop)కు బంద్ ప్రకటించింది. హోలీ పండుగ సందర్భంగా బార్ అండ్ రెస్టారెంట్లతో సహా ఇతర మద్యం దుకాణాలు మూసీ వేయాలని పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్, సైబరాబాద్తోపాటు రాచకొండ కమిషనరేట్ పరిధిలో మద్యం అమ్మకాలు జరగకుండా వైన్స్ షాపులను మూసివేయనున్నట్లు ప్రకటించారు. అయితే స్టార్ హోటల్స్, రిజిస్టర్డ్ క్లబ్బులను మాత్రం ఈ ఆదేశాల నుంచి మినహాయింపు ఇచ్చారు.
ఈ నెల 25న ఉదయం 6 గంటల నుంచి 26న ఉదయం 6 గంటల వరకు మద్యం షాపులు, రెస్టారెంట్లు మూతపడనున్నాయి. హోలీ వేడుకల్లో అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఈ చర్యలు తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఇతరులకు ఇబ్బంది కలిగించకుండా హోలీ జరుపుకోవాలని సూచించారు. రోడ్లపై వాహనదారులను ఇబ్బంది పెట్టడం, వారిపై రంగులు చల్లడం లాంటి చర్యలకు పాలుపడితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.