NGKL: రాయలగండి దేవాలయాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తానని అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ అన్నారు. శుక్రవారం పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్సీలు రాయలగండి చెన్నకేశవ స్వామి దేవాలయాన్ని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. దేవాలయం అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికతో కృషి చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో నాయకులు కుంద మల్లికార్జున్, అనిల్ పాల్గొన్నారు.