HYD: సికింద్రాబాద్ ప్రాంతాన్ని ప్రభుత్వం నామరూపాల్లేకుండా చేస్తోందని మాజీమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆరోపించారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా ఇవాళ ఉదయం ‘సికింద్రాబాద్ అస్తిత్వం, ఆత్మగౌరవ ర్యాలీ’ నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. సికింద్రాబాద్ మీదుగా సాగే ఈ ర్యాలీలో ప్రధాన రాజకీయ పార్టీలు, స్వచ్ఛంద సంస్థలు పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు.