WG: గోదావరి జిల్లాల ఆతిథ్యమే వేరు. మర్యాదలకు, ఆత్మీయతకు నిలయమని ఆకివీడుకు చెందిన తోట వాసు నిరూపించారు. కనుమ రోజున తన అల్లుడికి ఏకంగా 202 రకాల పిండివంటలతో భారీ విందు ఏర్పాటు చేశారు. వివిధ రకాల మిఠాయిలు, హాట్లు, సంప్రదాయ వంటకాలతో అల్లుడికి రాజభోజనం వడ్డించి, గోదావరి వారి ఆదరాభిమానాలను చాటుకున్నారు. ఈ విందు ఇప్పుడు స్థానికంగా చర్చనీయాంశమైంది.