E.G: సీతానగరం మండలం పెద్ద కొండేపూడి గ్రామ తోటల్లో అక్రమ మద్యం అమ్మకాలు జోరుగా సాగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఒక్కో బాటిల్‌పై రూ. 100 వరకు అదనంగా వసూలు చేస్తూ విక్రయిస్తున్నారని గ్రామస్తులు వాపోతున్నారు. ఈ అక్రమ దందాతో యువత దారి తప్పుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎక్సైజ్ పోలీసులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.