పెద్దపల్లి జిల్లాలో శనివారం ఉదయం భారీగా పొగమంచు కమ్మేయడంతో వాహనదారులు లైట్లు వేసుకుని ప్రయాణాలు సాగిస్తున్నారు. ఓదెల మండలంలో గుంపుల–కాల్వ శ్రీరాంపూర్ ప్రధాన రహదారిపై దారి సరిగా కనిపించని పరిస్థితి నెలకొనగా, చలి తీవ్రతతో ప్రజలు వణికిపోతున్నారు. ఈ నేపథ్యంలో ఉదయపు ప్రయాణాల్లో అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.