సత్యసాయి: సోమందేపల్లి మండలం మంచేపల్లి గ్రామంలో టీడీపీ సీనియర్ కార్యకర్త గుర్రప్ప అనారోగ్యంతో బాధపడుతూ రెండు రోజుల క్రితం మరణించారు. ఈ విషయం తెలుసుకున్న మంత్రి సవిత సోమవారం ఆ గ్రామానికి వెళ్లి గుర్రప్ప కుటుంబసభ్యులను పరామర్శించారు. అలాగే అదే గ్రామానికి చెందిన నాగభూషనప్ప కుమార్తె మరణించగా.. వారింటికీ కూడా వెళ్లి కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించారు.