SDPT: దసరా అంటేనే చెడుపై మంచి విజయమని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. నిన్న జిల్లా కేంద్రంలోని రంగధాంపల్లి హనుమాన్ దేవాలయం వద్ద జరిగిన దసరా రావణ దహన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నాడు తెలంగాణ వస్తదా ఇది అయితదా అని చాలా మంది ఆలోచించారు. కాని కేసీఆర్ అసాధ్యాన్ని సుసాధ్యం చేశారని అన్నారు. తెలంగాణకు సిద్దిపేట జిల్లా దిక్సూచి అయ్యిందన్నారు.