కృష్ణా: రైతులకు సూపర్ జీఎస్టీ ద్వారా కలిగే ప్రయోజనాలపై శుక్రవారం నాగాయలంకలో అవగాహనా ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్, ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణ, టీడీపీ నియోజకవర్గ పరిశీలకులు కనపర్తి శ్రీనివాసరావు ఈ ర్యాలీని ప్రారంభించారు. ఈ ర్యాలీలో రైతులు ఉత్సాహంగా ట్రాక్టర్లతో పాల్గొన్నారు. నియోజకవర్గ యువనాయకులు మండలి వెంకట్రామ్, ఇతర నాయకులు పాల్గొన్నారు.