SRD: 17 సెప్టెంబర్ 1948న 7వ నిజాం నవాబ్ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ తన బలగాలతో ఉక్కుమనిషి అప్పటి కేంద్ర హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ ముందు లొంగిపోయి భారత్ యూనియన్లో కలిసిన రోజు. కొంతమంది విలీనం అని ఇంకొంతమంది విమోచన అని తర్జనభర్జన వాదనలతో సంబరాలు జరుపుకుంటున్న రోజు. ఏ వాదనలు ఏమైనా? భారత ప్రజలు సంతోషించే రోజు, విమోచననా?? విలీనమా? అనే తెర లేపాల్సి ఉంది.