నల్గొండ రామగిరి కనకదుర్గమ్మ దేవాలయం సమీపంలో ఉదయం అదృశ్యమైన చిన్నారి చెన్నె ద్రేశ్వరిని టూ టౌన్ పోలీసులు గంటల వ్యవధిలోనే సురక్షితంగా గుర్తించారు. తల్లిదండ్రుల ఫిర్యాదుతో వేగంగా స్పందించిన పోలీసులు, ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టి చిన్నారిని కాపాడారు. పాపను క్షేమంగా తల్లిదండ్రులకు అప్పగించడంతో వారు పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.