MHBD: కురవి మండల కేంద్రంలోని శ్రీ వీరభద్రస్వామివారి ఆలయాన్ని ప్రముఖ సిని హీరో గోపిచంద్ ఈరోజు సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన స్వామివారి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. శివరాత్రి బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికను గోపిచంద్‌కు ఆలయ కార్యనిర్వాహణాధికారి సత్యనారాయణ, దర్మకర్త చిన్నం గణేష్‌లు అందజేశారు. కాగా, ఆయన అభిమానులు, స్థానికులు ఆయనకు స్వాగతం పలికారు.