మేడ్చల్: కరుణ,ప్రేమ,సేవ వంటి మానవత్వపు సహజ గుణాలు సమాజానికి ఎల్లప్పుడు అవసరమని తన జీవితం ద్వారా తెలియజెప్పిన మహోన్నత మానవతావాది, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మదర్ థెరిసా అని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ అన్నారు. ఆమె జయంతి సందర్భంగా సికింద్రాబాద్ మోండా డివిజన్లోని మదర్ థెరీసా విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించి ఆమె సేవలను కొనియాడారు.