HYD: మూసీ నది పునరుజ్జీవంలో భాగంగా, శాస్త్రీపురం వద్ద మీర్ ఆలం ట్యాంక్ మీదుగా 2.5 కి.మీ పొడవైన కేబుల్-స్టేడ్ వంతెన నిర్మాణానికి సీఎం రేవంత్ రెడ్డి ఆమోదం తెలిపారు. రూ. 319 కోట్ల వ్యయంతో KNR కన్స్ట్రక్షన్ లిమిటెడ్ ఈ ప్రాజెక్టును EPC మోడల్లో నిర్మిస్తుంది. ఈ వంతెన డిజైన్ దుర్గం చెరువు వంతెన కంటే అద్భుతంగా ఉంటుందని అధికారులు తెలిపారు.