ప్రజాభవన్ డిప్యూటీ సీఎం భట్టి మల్లు విక్రమార్క అధికార నివాసంగా ఉంటుందని ప్రధాన కార్యదర్శి శాంతకుమారి ఉత్తర్వులు జారీ చేశారు. సీఎం క్యాంప్ ఆఫీస్ కోసం ప్రత్యమ్నాయ భవనం చూస్తున్నారని తెలుస్తుంది.
Praja Bhavan: ప్రజాభవన్ (Praja Bhava) డిప్యూటీ సీఎం భట్టి మల్లు విక్రమార్క(Bhatti Vikramarka) అధికారిక నివాసంగా ఉంటుందని సీఎస్ శాంతకుమారి ఉత్తర్వులు జారీ చేశారు. క్రాంగ్రెస్(Congress) ప్రభుత్వం ఏర్పడిన తరువాత ప్రగతి భవన్‌ను మహాత్మ జ్యోతీబా పూలే ప్రజాభవన్‌గా మార్చారు. ప్రజాదర్బార్‌ను ఇక్కడి నుంచే ప్రభుత్వం నిర్వహిస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే చాలా కాలంగా ఉన్న ఇనుప కంచెను తొలగించారు. ఇప్పుడు ఈ భవనాన్ని ఉప ముఖ్యమంత్రి భట్టికి కేటాయించారు.
మరో వైపు సీఎం నివాసం కోసం అన్వేషిస్తున్నారని తెలుస్తుంది. మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి విభాగం (ఎంసీఆర్హెచ్ఆర్డీ )కేటాయించే అవకాశం ఉంది. ఉమ్మడి రాష్ట్రం నుంచి అది సీఎం క్యాంపు ఆఫీస్‌గా ఉంది. తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ (KCR) రెండు పర్యాయాలు అక్కడే ఉండి పరిపాలన అందించారు. అందులో మార్పులు కూడా చేశారు. లెక్క ప్రకారం సీఎం రేవంత్ రెడ్డి (Revanth reddy) అందులో ఉండాలి. కానీ ఆయన మరో చోట ఉండేందుకు సుముఖత వ్యక్తం చేస్తున్నారని చర్యల ద్వారా తెలుస్తోంది. పార్కింగ్, తదితర సౌకర్యాలు ఉండటంతో అదే అనుకూలమైన స్థలం అని సీఎం రేవంత్ రెడ్డి సూచించారని తెలుస్తోంది.