SRD: సదాశివపేట, ఆందోలు- జోగిపేట, నారాయణఖేడ్ మున్సిపాలిటీల ప్రత్యేక అధికారిగా అదనపు కలెక్టర్ మాధురినే నియమిస్తూ పురపాలక శాఖ శనివారం ఉత్తరం కూడా జారీ చేసింది. ఇప్పటి వరకు ప్రత్యేక అధికారిగా ఉన్న స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ ఉత్తరాఖండ్లో ఐఏఎస్ శిక్షణకు వెళ్లారు. ఆయన స్థానంలో మాధురి అదనపు బాధ్యతలు నిర్వహించనున్నారు.